Budget 2024 Highlights : వందే భారత్ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి.. ఉచిత సోలార్ విద్యుత్
Budget 2024 Highlights: సౌర విద్యుత్ ను ప్రోత్సహించే లక్ష్యంతో రూఫ్ టాప్ సోలారైజేషన్ విధానం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్ కాగా. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. అ వివరాలు..
ఉచిత సౌర విద్యుత్
దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందగలుగుతాయన్నారు. దీంతో ప్రతీ కుటుంబానికి ఏటా రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా చేసే వీలుకలుగుతుంది. మిగులు విద్యుత్ ను విద్యుత్‌ను పంపిణీ సంస్థల(డిస్కమ్ )కు విక్రయించుకోవచ్చని ఆమె చెప్పారు.
ఇటీవల అయోధ్య రామ మందిరం నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఈ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే వేగవంతం చేస్తామని మంత్రి ప్రకటించారు.
వందే భారత్ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి
Budget-2024 | రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద దేశంలో 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రధానంగా ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కూడా చెప్పారు.
వందేభారత్ రైళ్లలో పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వందే భారత్ తరహాలో 40 వేల కొత్త బోగీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను పెంచనున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలను మెట్రో రైలు, నమో భారత్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అలాగే విమానయాన రంగంపై సైతం కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను అనుసంధానిస్తామని తెలిపారు.
మధ్య తరగతి ప్రజలకు కొత్తగా గృహనిర్మాణ విధానం
Budget 2024 Highlights మధ్య తరగతి ప్రజల కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పట్టణాల్లో అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇచ్చామన్నారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరయ్యామని తెలిపారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..