Thursday, April 17Welcome to Vandebhaarath

Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..

Spread the love

Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..   ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీరిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే… ఇందుకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతోన్న‌ది వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్‌ పథకం కింద అర్హుల‌కు రూ.5 లక్షల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందిస్తారు. అలాగే ఈ కార్డ్ ద్వారా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశాకార్య‌క‌ర్త‌లు వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. పైగా ఇది న‌గ‌దు ర‌హిత సేవ‌. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతోందని కేంద్రం తెలిపింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద దేశంలో 6.2 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ న‌మోద‌య్యాయి. మొత్తంగా రూ.79,157 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. కేంద్రం ఎలాంటి నగదు, పత్రాలు లేకుండానే ఈ లబ్ధి పొందే వీలు కల్పించింది.

మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని అద్దె ఇళ్లు, మురికివాడలు లేదా అనధికారిక కాలనీల్లో నివసించే ప్రజలు తమ సొంత ఇళ్లు కొనవచ్చు లేదా నిర్మించుకోవచ్చునని త్వరలో ఒక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు.

READ MORE  EPFO 3.0 : ఇక‌పై మీ PF డ‌బ్బుల‌ను ATM ల నుంచి కూడా డ్రా చేసుకోవ‌చ్చు..

రికార్డు స్థాయిలో మౌలిక స‌దుపాయాలు

గ‌డిచిన పదేళ్లలో రికార్డు స్థాయిలో మౌలిక వసతులు కల్పించామని నిర్మలా సీతారామన్ అన్నారు. 11.8 కోట్ల మంది అన్నదాతలకు రకరకాల పథకాల ద్వారా ప్ర‌యోజ‌నం చేకూర్చామన్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభ సమయంలోనూ G20 సదస్సుని విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయమ‌ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. యువతకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రధాని న‌రేంద్ర‌ మోదీ లక్ష్యమ‌ని వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 70 వేల ఇండ్లు కట్టించి ఇచ్చామని స్పష్టం చేశారు. స్కిల్ ఇండియా పథకం కింద సుమారు 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చిన‌ట్లు వివరించారు నిర్మలా సీతారామన్. ప్రజల సగటు ఆదాయం 50% మేర పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం త‌గ్గింద‌ని తెలిపారు.

READ MORE  Hyderabad Metro | రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *