
97 వేల 4G సైట్లు పూర్తి!
న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో వై-ఫై కాలింగ్ (VoWiFi – Wi-Fi Calling) సేవలను జనవరి 1 నుండి అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌లకు ధీటుగా తన నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఈ అడుగు వేసింది.
4G వేగవంతం బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్ విస్తరణలో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికత: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీతో ఇప్పటికే 97,000 4G సైట్లు కమిషన్ చేయబడ్డాయి త్వరలోనే మరో 23,000 సైట్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 4G సాచురేషన్ సాధించాలని, ఆపై 5Gకి అప్‌గ్రేడ్ అవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వై-ఫై కాలింగ్ (Wi-Fi Calling) వల్ల లాభం ఏంటి?
- హై-రైజ్ బిల్డింగ్‌లు, బేస్‌మెంట్లు వంటి “షాడో జోన్‌లలో” మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేనప్పుడు ఈ సేవ ఎంతో ఉపయోగపడుతుంది.
- నో యాప్: దీని కోసం విడిగా ఎలాంటి యాప్ అవసరం లేదు, ఫోన్ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేయవచ్చు.
- నో ఎక్స్‌ట్రా ఛార్జ్: ఈ సేవకు అదనపు రుసుము ఉండదు. మీ ప్రస్తుత వాయిస్ ప్లాన్ నుండే కాల్స్ కట్ అవుతాయి.
- గ్రామీణ ప్రాంతాలకు మేలు: బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్న ఏ మారుమూల ప్రాంతం నుంచైనా సిగ్నల్ లేకున్నా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
పెరుగుతున్న సబ్‌స్క్రైబర్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గణాంకాల ప్రకారం.. 2025 అక్టోబర్‌లో బిఎస్ఎన్ఎల్ కొత్తగా 2.69 లక్షల మంది వైర్‌లెస్ చందాదారులను తన ఖాతాలో వేసుకుంది. దీనితో బిఎస్ఎన్ఎల్ మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 9.25 కోట్లకు చేరింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్‌లు పెంచడం బిఎస్ఎన్ఎల్‌కు వరంగా మారింది.
భవిష్యత్తు ప్రణాళిక పాత 3G సేవలను నిలిపివేసి, ఆ స్పెక్ట్రమ్‌ను (2100 MHz) 4G సామర్థ్యాన్ని పెంచడానికి బిఎస్ఎన్ఎల్ ఉపయోగిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఆధారిత అప్‌గ్రేడ్‌ల ద్వారా అతి త్వరలో 5G సేవలను కూడా అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది.

