Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు..
బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba) మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేరళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవత్సరాల బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేరళలో మెదడును తినే అమీబా సోకినవారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు జూలై 1న ఆస్పత్రిలో చేరినపుడు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించామని డాక్టర్లు వెల్లడించారు. చికిత్స కోసం విదేశాల నుంచి మెడిసిన్స్ తెప్పిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు.
మలప్పురం జిల్లాలో ఇటీవల ఓ ఐదేళ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (మెదడు తినే అమీబా) కారణంగా మృతిచెందింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వారానికిపైగానే వెంటిలేటర్‌పై ఉంది. కానీ డాక్టర్లు ఎంత శ్రమించినప్పటికీ ఆ చిన్నారిని ప్రాణాలు నిలవలేదు. అలాగే జూన్ 25న కన్నూరుకు చెందిన మరో బాలిక మృతి చెందింది. గత బుధవారం కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ అనే బాలుడు కూడా ఇదే వ్యాధితో మరణించాడు.
అత్యంత ప్రమాదకరమైన అమీబా
మెదడు తినే అమీబా చాలా ప్రమాదకరమైనది. ఈ ఏక కణ ప్రొటోజోవన్ పరాన్నజీవి సోకితే.. మరణాల రేటు 97 శాతంగా ఉంది. దీని బారిన పడి కోలుకొని బతికినవారు చాలా తక్కువ అని తెలుస్తోంది. 1960లో తొలిసారిగా దక్షిణ ఆస్ట్రేలియాలో పీఏఎం కేసు గుర్తించారు. ఆ తర్వాత క్విన్‌లాండ్, అమెరికాల్లో కూడా కేసులు కనిపించాయి. 1962 నుంచి 2001 వరకు అమెరికాలో మొత్తం 154 కేసులు వెలుగుచూశాయి. ఈ అమీబా సోకినవారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు. దీన్ని ఇది ప్రమాదకరమైనదో తెలుసుకోవచ్చు. మన దేశంలో తొలిసారిగా 2017లో కేరళలోని అలప్పుజలోని తిరుమల వార్డులో పీఏఎం కేసును గుర్తించారు. అలాగే 2020, 2022లో కోజికోడ్‌లో మరో ఐదు కేసులు వెలుగుచూశాయి. ఈ అమీబా సోకినవారు జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు.
ఎలా సోకుతుంది..?
Brain Eating Amoeba : మెదడును తినే అమీబా అని పిలిచే నెగ్లేరియా ఫోలేరి (Naegleria Fowleri) అరుదుగానే సోకుతుంది. అయినప్పటికీ ఇది మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుంది. దీనిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (పీఏఎం) అంటారు. నెగ్లేరియా ఫోలేరి అనేది వెచ్చటి మంచి నీటి చెరువులు, నదులు, కుంటలు, శుభ్రత పాటించని స్విమింగ్‌పూల్స్‌లో జీవిస్తుంది. ఇది 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉన్న ఉష్ణోగ్రతలో పెరుగుతుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..