Saturday, April 19Welcome to Vandebhaarath

Boat Wave Sigma 3 | తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్

Spread the love

Boat Wave Sigma 3 | బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ భార‌త్ లో లాంచ్ అయింది. ఇది స్మార్ట్‌వాచ్ క్రెస్ట్+ OSలో నడుస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిట‌రింగ్‌,, SpO2, డైయిలీ యాక్టివిటీ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. మ్యాప్ మై ఇండియా నావిగేషన్‌కు కూడా ఈ వాచ్ సపోర్ట్ ఇస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో బోట్ వేవ్ సిగ్మా 3 ధర

Boat Wave Sigma 3 Price : బోట్ వేవ్ సిగ్మా 3 భారతదేశంలో రూ. 1,199 ధ‌ర‌లో అందుబాటులో ఉంది. ఇది బోట్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా వంటి ఆన్ లైన్ ఈకామ‌ర్స్ వెబ్ సైట్ల‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఏడు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ బ్లోసమ్, ర‌స్టిక్ రోజ్, సఫైర్ బ్రీజ్.

READ MORE  BSNL | జియో, ఎయిర్‌టెక్‌కు కంటే చవకగా... రూ.99కే బిఎస్ఎన్ఎల్‌ రీచార్జి ప్లాన్‌..

బోట్ వేవ్ సిగ్మా 3 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు

Boat Wave Sigma 3 Specifications, Features : బోట్ వేవ్ సిగ్మా 3 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 2.01-అంగుళాల డిస్‌ప్లే, 550 నిట్స్ బ్రైట్‌నెస్, వేక్ జెస్చర్ సపోర్ట్‌ను కలిగి ఉంది. స్మార్ట్ వేరియ‌బుల్ DIY వాచ్ ఫేస్ స్టూడియోని కలిగి ఉంది, ఇది వినియోగదారులు వారి వాచ్ ఫేస్ ల‌ను కస్టొమైజ్ డిజైన్‌లు, ఫోటోలు లేదా థీమ్‌లతో క‌స్టొమైజ్ చేసుకోవ‌డానికి అనుమతిస్తుంది. ఇది 700 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో కూడా వస్తుంది.

READ MORE  Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..

బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ క్రెస్ట్+ OSలో నడుస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. బోట్ వేవ్ సిగ్మా 3 ఇన్‌బిల్ట్ క్విక్ డయల్ ప్యాడ్‌ను కలిగి ఉంది, ఇది సేవ్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ ను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వినియోగదారులు వాచ్ QR ట్రేలో QR కోడ్‌లను సేవ్ చేయడానికి MapMyIndiaతో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూపించడానికి అనుమతించే క్రెస్ట్ యాప్‌తో కూడా అనుకూలంగా ఉంటుంది.

బోట్ వేవ్ సిగ్మా 3 హార్ట్ రేట్ సెన్సార్‌, , SpO2, డెయిలీ యాక్టివిటీ ట్రాకింగ్‌తో పాటు సెడెంటరీ రిమైండర్ కోసం మ‌ల్టీ హెల్త్‌, ఫిట్‌నెస్-సెన్సార్‌లతో వస్తుంది. ఈ ట్రాకర్ల నుంచి సేకరించిన డేటా క్రెస్ట్ యాప్‌తో విశ్లేషిస్తుంది. ఈ వాచ్ వినియోగదారులకు కెమెరా కంట్రోల్ తో పాటు స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్ కంట్రోల్ కూడా చేయ‌వ‌చ్చు.

READ MORE  Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు

 

వేవ్ సిగ్మా 3లోని 230mAh బ్యాటరీ ఏడు రోజుల వరకు వినియోగించుకోవ‌చ్చ‌ని బోట్ పేర్కొంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ని వాచ్‌లో యాక్టివ్‌గా ఉపయోగించినట్లయితే, బ్యాటరీ రెండు రోజుల వరకు ఉంటుందని క్లెయిమ్ చేస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది, దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP67 రేటింగ్‌తో వస్తుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *