Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

READ MORE  RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం - వెంటనే అప్లయ్..!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకుంటే ముందుగా దిగువ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి.

అర్హతలు

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి. ఇక వయోపరిమితి విషయానికొస్తే.. అభ్యర్థుల వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్పుడే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.

READ MORE  Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

ఎంపిక  విధానం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు వారి అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధిత ప్రాంతీయ కార్యాలయం నుంచి ఇమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ వివరాలు అందిస్తారు.  బ్యాంకింగ్ రంగంలో పని అనుభవంతో పాటు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి. అలాగే  అవసరమైన అన్ని పత్రాలను సరిగ్గా జత చేయడం మరిచిపోవద్దు..

READ MORE  SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి లింక్
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *