పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్
భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అసలేం జరిగింది?
తెలంగాణలోని పరకాలలో నిజాం పరిపాలన (hyderabad nizam) కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణహోమానికి తెగబడ్డారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం లభించిన తర్కాత నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు అనేక యత్నాలు జరిగాయి. అయితే వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా పరకాల(Parakala)లోని అమరధామం నిలుస్తుంది. పరకాల ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ (Telangana) ప్రాంతానికి మాత్రం రాలేదు. ఈ ప్రాతం నిజాం, రజాకార్ల ఆధీనంలోనే ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. 1945-46 కాలంలో.. తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం (rebellion in Telangana) జరుగుతున్న కాలం అది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, భూమి కోసం దొరలపై కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకుల అధ్వర్యంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
నిజాం తన అధికారం చేజారుతోందని భయపడి ప్రైవేటు సైన్యమైన రజాకార్లను ఖాసీం రిజ్వీ (Kasim Rizvi) నాయకత్వంలో నియమించుకున్నాడు. ఈక్రమంలో రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ పల్లెల్లో ప్రజలు సాయుధ పోరాటం మొదలుపెట్టారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుంచి మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
1947 సెప్టెంబరు 2న వరంగల్ జిల్లా పరకాలలో జలియన్ వాలా బాగ్ దుర్ఘటనను తలపించే ఘటన జరిగింది, భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని విమోచనోద్యమకారులు ఆందోళన చేపట్టారు. సెప్టెంబరు 2, 1947న ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని పరకాల సమీపంలోని పైడిపల్లి నుంచి ఉద్యమకారులు భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి పరకాలకు బయలుదేరారు. ఈ విషయాన్ని రజాకార్లు పసిగట్టి నిజాం పాలకుడితో ఉద్యమకారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేయించారు. కాశీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు.. ఉద్యమకారులను ఊచకోత కోశారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన నిరసనకారులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా, 13 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో మృతి చెందారు. మరో ముగ్గురిని రంగాపూర్ గామంలో ఓ చెట్టుకు కటేసి అత్యంత దారుణంగా గొడ్డలి, బడిసెలతో, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణ హోమంలో 200 మందికి పైగా ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన దక్షిణాది జలియన్ వాలా బాగ్ గా గుర్తింపు పొందింది.
సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో ఎటుచూసినా రజాకార్లు ఉండేవారు.. ఊళ్లోకి వస్తున్న వారిపై నిఘా పెట్టి ఉంచే వారు. గ్రామాల పొలిమేరల్లోనే కాపు కాస్తూ అనుమానమొస్తే వారి ఇంటికి వెళ్లి ఏది పడితే అది లాక్కునే వారు. వారి వద్ద తుపాకులు కూడా ఉండేవి.
ఖాసిం రిజ్వీ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా రజాకర్ల అనేక ఆగడాలకు దిగారు. దీంతో భారత సైన్యం తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకునేందుకు ‘ఆపరేషన్ పోలో’ చేపట్టింది. 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో… సెప్టెంబరు 17న నిజాం సైన్యం లొంగిపోవడం తో ముగిసిం ది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?
మారణహోమం కళ్లకు కట్టినట్లుగా అద్భుత నిర్మాణం
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు నాటి పోరాటాన్ని కళ్లకు కట్టేట్టుగా 1998లో పరకాలలో ‘అమరధామం’(Amaradamam ) పేరిట ఓ అద్భుతమైన స్మారక నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ ఆవిష్కరించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు పరకాల మారణహోమాన్ని ’దక్షిణాది జలియన్ వాలాభాగ్’ గా అభివర్ణించారు.
“తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరులు అమరులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంగా మొదలైన పోరాటం.. చాకలి ఐలమ్మతో మొదలైన తిరుగుబాటు, పేద రైతులు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరులో ఎందరో బలయ్యారు. దొరల చేతుల్లో వందాలది మంది పేద రైతులు దోపిడీకి గురయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముందు ఎన్నో ఘటనలు జరిగాయి. వాటిలో పరకాల, బెహరాన్ పల్లి వంటి ఘటనలు ప్రముఖమైనవి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.