Posted in

Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు

Google Pay PhonePe Paytm users
Google Pay PhonePe Paytm users
Spread the love

Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPIని ఉపయోగించే వారికోసం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. UPIకి లింక్ అయిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే అది తొలగించబడుతుంది. UPI చెల్లింపులు చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలలో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని అధికారులు వారు పేర్కొంటున్నారు. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే, అది మోసానికి అవకాశం పెంచుతుంది. ప్రభుత్వం తన పౌరుల భద్రతను పెంచడం సైబర్ నేరాలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

UPI లావాదేవీలను సులభతరం చేయడానికి మీ బ్యాంక్ ఖాతాకు యాక్టివ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. చెల్లింపుల సమయంలో ఈ నంబర్ కీలకమైన ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. మీరు పంపించాల్సిన
డబ్బులు కచ్చితంగా వారికే చెల్లించేలా గ్రహీతకు చేరుకుంటాయని నిర్ధారిస్తుంది. ఒక మొబైల్ నంబర్ నిష్క్రియంగా ఉండి, మరొక వ్యక్తికి కేటాయించబడితే, అది పేమెంట్ కాకపోవడం లేదా చెల్లింపులను లేదా ఇతరులకు డబ్బులు జమకావడం జరగవచ్చు.

మీరు ఏమి చేయాలి

Google Pay, PhonePe, Paytm users : మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకుంటే లేదా కొంతకాలంగా రీఛార్జ్ చేయకపోతే, ఆ నంబర్ ఇప్పటికీ మీ పేరుతో యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకునేందుకు మీ టెలికాం ప్రొవైడర్ (జియో, ఎయిర్‌టెల్, విఐ, లేదా బిఎస్‌ఎన్‌ఎల్ వంటివి)తో సంప్రదించాలి. అది కాకపోతే, మీరు దానిని వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ నంబర్‌తో మీ బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలి.

ఇదిలా ఉండగా ప్రతి వారం ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను అప్ డేట్ చేయాలని NPCI బ్యాంకులు, UPI అప్లికేషన్‌లను ఆదేశించింది. ఈ ప్రక్రియఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఏవైనా ఇనాక్టివ్ నంబర్‌లను తొలగించాలని సూచించింది.


Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *