
Acer smartphones | ల్యాప్‌టాప్‌లకు పేరుగాంచిన ఏసర్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ మార్చి 25న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్ గురించి వివరాలు ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కనిపించాయి, లాంచ్ తేదీని వెల్లడించాయి. ప్రస్తుతం, భారతీయ స్మార్ట్‌ఫోన్ ల్యాండ్‌స్కేప్‌లో షియోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్, ఇన్ఫినిక్స్, టెక్నో వంటి చైనీస్ బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదే సమయంలో, వినియోగదారులు కూడా శామ్‌సంగ్, ఆపిల్, నథింగ్ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఏసర్ కొత్త పోటీదారుగా అడుగుపెడుతోంది. ఇటీవల, ఆ కంపెనీ భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించడానికి వీలుగా ఇండ్‌కల్ టెక్నాలజీతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది, దీని ద్వారా దేశంలో ఏసర్-బ్రాండెడ్ ఫోన్‌లను ప్రారంభించనుంది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు లాంచ్ మార్చికి నిర్ణయించారు.
ఏసర్ (Acer) తన తొలి స్మార్ట్‌ఫోన్ (Acer smartphones name) పేరును గోప్యంగా ఉంచింది. అయితే, అమెజాన్ (Amazon) వెబ్ సైట్ లో “ది నెక్స్ట్ హారిజన్” అనే పదబంధం నల్లని బ్యాక్ గ్రౌంట్ తో సెట్ చేసిన ఫొటో కనిపిస్తోంది. అలాగే అంతరిక్షంలో తేలియాడే వ్యోమగామి యొక్క ఆసక్తికరమైన చిత్రం కూడా ఉంది. ముఖ్యంగా, వ్యోమగామి వెనుక చిత్రీకరించబడిన వృత్తాకార వలయం ఉంది, ఇది పరికరం వెనుక భాగంలో వృత్తాకార వలయాన్ని కలిగి ఉండే కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను సూచిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు (Acer smartphones Price)ఇంకా తెలియరాలేదు.ఇండ్‌కల్‌తో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించినప్పుడు, రూ. 15,000 నుండి రూ. 50,000 విభాగంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఏసర్ ప్రకటించింది. మెరుగైన స్పెసిఫికేషన్లు. అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్న ప్రీమియం మోడళ్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని సమాచారం.
ఇటీవల, Acerone Liquid S162E4, Acerone Liquid S272E4 అనే రెండు పరికరాలు Acer India వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4G కనెక్టివిటీతో MediaTek Helio P35 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయని, అవి బలమైన 5,000mAh బ్యాటరీతో అమర్చబడి ఉండవచ్చు.