10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం
10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే తన రైళ్లు, ట్రాక్‌లను ఆధునీకరించడంతోపాటు కవచ్ వ్యవస్థను కూడా అన్ని రూట్లలో ఇన్ స్టాల్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చేప్పింది. సెప్టెంబర్ 15న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా 10 వందే భారత్ రైళ్లను ప్రకటించే/ప్రారంభించనున్నారు.
కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
10 New Vande Bharat Express : కొత్త వందే భారత్ రైళ్లు టాటా నగర్ నుంచి పాట్నా, టాటానగర్ నుండి బెర్హంపూర్, వారణాసి నుంచి డియోఘర్, దుర్గ్ నుంచి విశాఖపట్నం, హౌరా నుంచి గయా, హౌరా నుంచి భాగల్పూర్, హుబ్లీ నుంచి పూణే, నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, ఆగ్రా కాంట్ నుంచి బనారస్ అలాగే హౌరా నుంచి రూర్కెలా వరకు కొత్త రైళ్లు సేవలందించనున్నాయి.
ఈ వందే భారత్ రైళ్లు చైర్-కార్ రైళ్లు కొత్తగా ప్రారంభించిన వందే భారత్ స్లీపర్ రైళ్లు కాదు. వందే భారత్ రైళ్లు దాదాపు 6-8 గంటల్లో కవర్ చేయగల మార్గాల్లో నడుస్తాయి. రాబోయే రైళ్ల సమయాన్ని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటిస్తుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో వస్తున్నాయి. మొత్తం సీటింగ్ సామర్థ్యం 1,128 మంది ప్రయాణికులు. ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ వేరియంట్ మొత్తం 530 సీట్ల సామర్థ్యంతో 8 కోచ్‌లను కలిగి ఉంటుంది. చైర్ -కార్ రైళ్లు 600 నుండి 800 కిమీల వరకు ఉన్న మార్గాల్లో నడుస్తాయి. అయితే దీనికి విరుద్ధంగా, స్లీపర్ వెర్షన్ 16 కోచ్‌లను కలిగి ఉంటుంది. 823 సీట్లు ఉంటాయి. ఇది 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లాంగ్ రూట్లలో నడుస్తుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాక్సిలరేషన్, వేగాన్ని పెంచే అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. ప్రతీ కోచ్‌లో ఆటోమేటిక్ డోర్లు, GPS-ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వినోదం కోసం ఆన్-బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi, అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ సిస్టమ్ ఉంది. ఇంకా, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, రైలులో 30% వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగల రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..