సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యం
Warangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...