LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు
LPG Rates : ఉజ్వల్ పథకం, (PMUY), ఉజ్జ్వల్ పథకం కాని వినియోగదారులకు రేపు ఉదయం నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) ధర సిలిండర్‌కు రూ.50 పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. వంట గ్యాస్ లేదా ఎల్‌పిజి ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని చెప్పారు.
దీనితో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ (LPG Rates ) ధర రూ.500 నుండి రూ.550కి పెరుగుతుంది. ఇతరులకు, ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853కి పెరుగుతుంది. రెండు వారాల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని మంత్రి చెప్పారు.LPG ధరల పెంపు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించబడుతుంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా మార్చబడుతుంది, అని ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ( BPL ) కుటుంబాలకు చెందిన మ...