Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌ను "చైనా భూభాగంలో అంతర్లీన భాగం" అని పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత అమెరికా ఈ ప్రకటన చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. "అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తుంది, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక లేదా పౌరుల ద్వారా చొరబాట్లు లేదా ఆక్రమణలను ప్రోత్సహించడం వంటి ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము" అని పేర్కొంది.
సెలా టన్నెల్ నిర్మాణంపై అక్కసు
చైనా (China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, జిజాంగ్ దక్షిణ భాగం (టిబెట్‌కు చైనా పేరు) చై...