హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం
Assembly Election Results 2024 LIVE UPDATES : హర్యానా, జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ట్రెండ్ అంతుచిక్కుండా దూసుకూపోయింది. క్షణక్షణానికి సాగింది. గణంకాలు మారుతూ వచ్చాయి. ప్రారంభంలో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపితో గట్టి పోటీని ఇస్తున్నట్లు చూపించాయి. మొదట్లో హర్యానాలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి, ప్రారంభ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్‌లు స్వతంత్రులకు అనుకూలంగా రెండు స్థానాలను చూపించాయి.
జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి బీజేపీతో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోగా, పీడీపీ ఇంకా ఏ స్థానంలోనూ ఆధిక్యంలోకి రాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్లను తెరిచారు. ఈవీఎంల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు అరగంట తర్వాత ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు 2024 తర్వ...