Thursday, March 13Thank you for visiting

Tag: Buffalo milk

కుక్క కరిచిన గేదె పాల అమ్మకం

Local
 ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని గేదె యజమాని నాన్నయ్య.. ఆందోళన చెందాడు. అందుకే ఆ విషయాన్ని దాచి యథావిధిగా ఊరంతటికీ పాలు అమ్మాడు. అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో...
Exit mobile version