Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది
నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం "అద్భుతం" గా కనిపించిందని తెలిపారు. సునీతా విలియమ్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారతదేశాన్ని చూసిన తన విస్మయపరిచే అనుభవాన్ని పంచుకున్నారు, హిమాలయాలు, శక్తివంతమైన తీరప్రాంతం, ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న నగర దీపాల వలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలు అద్నుభుతంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
"భారతదేశం అద్భుతంగా ఉంది," అని విలియమ్స్ అన్నారు. సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లను...