Wednesday, March 5Thank you for visiting

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Spread the love

Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి – బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు.

రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా..

స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్‌ ‌యూనిఫామ్స్ ‌కుట్టుపని కూడా మహిళా సంఘాలకు అప్పగించింది. దని వ‌ల్ల రాష్ట్రంలోని సంఘాల మహిళలకు రూ. 50 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా క్యాంటీన్లు..

రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్ల (Mahila Shakti canteens ) ను ఏర్పాటు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సెక్రటేరియట్‌, అన్ని జిల్లాల‌ ‌కలెక్టర్ ‌కార్యాలయాలు,, ప్రధాన ప్ర‌భుత్వ‌ కార్యాలయాలలో, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు, పారిశ్రామిక వాడ‌ల్లో ఈ మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క్యాంటిన్ల ఏర్పాటు కోసం ఇప్ప‌టికే ప్రణాళికలు తయారు చేసిన‌ట్లు మంత్రి మంత్రి సీతక్క వెల్ల‌డించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ. 20,000 కోట్లకు అద‌నంగా 2,25, 000 మహిళలకు ఉపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

స్వ‌యం ఉపాధి కోసం శిక్ష‌ణ‌

గ్రామీణ మహిళలకు స్వ‌యం ఉపాధి కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు. పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమతోపాటు ఇతర వృత్తులలో తగిన శిక్షణ కల్పించేందుకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించునున్నట్లు మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు, మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెల రూ.2,500 త్వరలో అంద‌చేస్తామ‌ని హామీ ఇచ్చారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version