
Yogi Model | ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) క్రిమినల్స్ ఆటకట్టించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. గురువారం బహ్రైచ్ హింసాకాండలో పాల్గొన్న ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ హడా బసేహరి ప్రాంతంలో జరిగింది, ఇది నాన్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది భారత్ , నేపాల్ సరిహద్దు నుండి 15 కి.మీ దూరంలో ఉంది.
యూపీ పోలీసు బలగాలకు ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు ఇదే మొదటిసారి కాదు . అధికారం చేపట్టినప్పటి నుంచి, యోగీ ప్రభుత్వం మాఫియాలు, గ్యాంగ్‌స్టర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. నేరాలను అరికట్టడానికి కఠినమైన చర్యలను అమలు చేసింది. నేరస్థులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్‌లను బుల్‌డోజింగ్ చేయడం ద్వారా, యోగి మోడల్ దేశంలోనే పాపులర్ అయింది. పౌరుల భద్రతపై విశ్వాసాన్ని కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం దూకుడుగా ముందుకుసాగుతోంది.
యుపిలో కీలక ఎన్‌కౌంటర్లు..
- వికాస్ దూబే ఎన్‌కౌంటర్ (జూలై 2020) : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉజ్జయిని నుండి అతనిని తీసుకెళ్తున్న పోలీసు వాహనం బోల్తాపడటంతో మరణించాడు. ప్రమాదం తరువాత, దూబే తప్పించుకోవడానికి యత్నించాడు, దీంతో పోలీసులు పోలీసులు కాల్పులు జరిపారు. దూబే పేరుమోసిన గ్యాంగస్టర్.. కాన్పూర్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది పోలీసు అధికారులను హతమార్చాడు.
- టింకు కపాలా ఎన్‌కౌంటర్ (జూలై 2020): ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బారాబంకిలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో టింకు కపాలా చనిపోయాడు.ఈ గ్యాంగ్‌స్టర్ తలపై ₹1 లక్ష బహుమతి ప్రకటించారు.
- హమ్జా ఎన్‌కౌంటర్ (అక్టోబర్ 2021): లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బంగ్లాదేశ్ గ్యాంగ్‌స్టర్ హమ్జా మరణించాడు.
- డకోయిట్ గౌరీ యాదవ్ ఎన్‌కౌంటర్ (అక్టోబర్ 2021): ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డకోయిట్ ఉదయ్ భాన్ యాదవ్ అలియాస్ గౌరీ యాదవ్‌ను కాల్చి చంపింది . గౌరీ యాదవ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో చురుకుగా ఉండేవాడు
- మోతీ సింగ్ ఎన్‌కౌంటర్ (ఫిబ్రవరి 2021): కాస్‌గంజ్‌లో కానిస్టేబుల్‌ను హత్య చేసి సబ్-ఇన్‌స్పెక్టర్‌ను గాయపరిచిన నిందితుడు మోతీ సింగ్ రాష్ట్ర పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ ఇతర నేరస్థులకు హెచ్చరికగా పనిచేసింది.
- వినోద్ కుమార్ సింగ్ ఎన్‌కౌంటర్ (సెప్టెంబర్ 2022): జౌన్‌పూర్ పోలీసులతో జరిగిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ వినోద్ కుమార్ సింగ్ మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్ నేరస్తులను పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఊతమిచ్చింది. ప్రభుత్వం జీరో-టాలరెన్స్ విధానానికి ఉదాహరణగా నిలిచింది.
- మనీష్ సింగ్ అలియాస్ సోను ఎన్‌కౌంటర్ (మార్చి 2022): వారణాసి (రూరల్)లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSTF)తో జరిగిన ఎదురుకాల్పుల్లో సోనూ అని పిలువబడే మనీష్ సింగ్ మరణించాడు. ఏడు హత్యలతో సహా అతనిపై 32 క్రిమినల్ కేసులు ఉన్న మనీష్ సింగ్ ప్రజల భద్రతకు ముప్పుగా ఉన్నాడు. అతని మరణంతో ఆ ప్రాంతంలో వ్యవస్థీకృత నేరాలకు చెక్ పడింది.
- అసద్ అహ్మద్, గులామ్ ఎన్‌కౌంటర్ (ఏప్రిల్ 2023): ఝాన్సీలో యుపిఎస్‌టిఎఫ్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాఫియాగా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, మక్సుదాన్ కుమారుడు గులాం మరణించారు. ఉమేష్ పాల్ హత్యకేసులో ప్రమేయం ఉన్నందుకు ఇద్దరికీ ఒక్కొక్కరికి ₹5 లక్షల రివార్డు ఉంది.
- బదౌన్ సాజిద్ ఎన్‌కౌంటర్ (మార్చి 2024): ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లోని బాబా కాలనీకి చెందిన సాజిద్ అనే స్థానిక బార్బర్ ఇద్దరు పిల్లలను నరికి చంపిన తర్వాత పోలీసు ఎన్‌కౌంటర్‌లో అతడు హతమయ్యాడు. తనను వెంబడిస్తున్న పోలీసు బృందంపై కాల్పులు జరపడంతో సాజిద్ ను కాల్చి చంపారని ఉత్తరప్రదేశ్ డిజిపి ప్రశాంత్ కుమార్ తెలిపారు.
- మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్ (సెప్టెంబర్ 2024: సుల్తాన్‌పూర్‌లో జరిగిన దోపిడీ ఘటనలో, పోలీసులు పలువురు నేరస్థులను అరెస్టు చేశారు, మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఏడేళ్లలో 49 మంది క్రిమినల్స్ హతం
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) చీఫ్ ప్రకారం, గత ఏడు సంవత్సరాలుగా, 7,000 మందికి పైగా నేరస్థులను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఎన్‌కౌంటర్లలో 49 మంది నేరస్థులు మరణించారు.ఈ కాలంలో మొత్తం 7,015 మంది కరుడుగట్టిన, వాంటెడ్ నేరస్థులు పట్టుబడ్డారని UP STF ADG అమితాబ్ యష్ తెలిపారు. వారిలో, 49 మంది మరణించారు. అందరిపై ₹ 10,000 నుంచి ₹ 5 లక్షల వరకు రివార్డులు ఉన్నాయి. ఇంకా, STF కిడ్నాప్, దోపిడీ, హత్యలతో సహా 559 నేర సంఘటనలను నియంత్రించింది.
గత ఏడున్నర సంవత్సరాల్లో, పరీక్షల అవకతవకలు, పేపర్ లీక్‌లను అరికట్టడానికి STF కూడా చర్య తీసుకుంది, వాటిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 193 ముఠాలకు చెందిన 926 మంది గ్యాంగ్ లీడర్లు, ఫెసిలిటేటర్లపై ఎస్టీఎఫ్ చర్యలు తీసుకుంది. అదనంగా 379 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. అక్రమ ఆయుధాల రవాణాకు పాల్పడుతున్న 189 మంది నేరస్థులను ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది, వారి నుంచి 2,080 అక్రమ ఆయుధాలు మరియు 8,229 అక్రమ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుంది.
అంతేకాకుండా, పంజాబ్, హర్యానా సహా వివిధ రాష్ట్రాల నుంచి 523 మంది మద్యం స్మగ్లర్లను అరెస్టు చేసిన అక్రమ మద్యం రవాణాదారులపై STF చర్యలు తీసుకుంది . 80,579 మద్యం బాటిళ్లు, 330,866 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, 7,560 లీటర్ల ఇంట్లో తయారు చేసిన మద్యం స్వాధీనం చేసుకున్నారు.