Tuesday, March 4Thank you for visiting

Tulsi Gabbard | ట్రంప్ 2.0లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ గా హిందూ కాంగ్రెస్ మహిళ

Spread the love

Tulsi Gabbard | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ (Director of National Intelligence (DNI)) డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌ను నియమించారు. ఇది అమెరికా గూఢచారి సంస్థలలో అగ్రగామిగా, అధ్యక్షుడి అత్యున్నత స్పై ఏజెన్సీ సలహాదారుగా పనిచేసే శక్తివంతమైన పదవిగా భావిస్తారు.

తులసి గబ్బర్డ్ ఎవరు?

తులసి గబ్బార్డ్ రెండు దశాబ్దాలకు పైగా US ఆర్మీ నేషనల్ గార్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఇరాక్, కువైట్ రెండింటిలోనూ పనిచేసింది, ముఖ్యంగా, ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీపై హౌస్ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేశారు.

2013 నుండి 2021 వరకు, గబ్బర్డ్ డెమొక్రాట్‌గా హవాయి 2వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో, హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేసి, జాతీయ భద్రత, పౌర హక్కుల పట్ల ఆమె పోరాడి గుర్తింపు పొందారు.

ఇంటెలిజెన్స్ విషయాలలో ఆమెకు ప్ర‌త్య‌క్ష‌ అనుభవం లేనప్పటికీ, సైనిక వ్యవహారాలలో ఆమె నేపథ్యం స్వదేశీ భద్రతపై విధాన రూపకల్పనలో ఆమె అనుభవం ఉంది. ఈ నేప‌థ్యంలోనే డోనాల్డ్ ట్రంప్ గ‌బార్డ్ ను ఎంపిక చేశారు.

మొదటి హిందూ కాంగ్రెస్ మహిళ

తులసి గబ్బార్డ్ US కాంగ్రెస్‌లో పనిచేసిన మొట్టమొదటి హిందువు. గబ్బార్డ్‌కు భారతదేశంతో ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ, ఆమె అనేక‌ సాంస్కృతిక వాతావరణంలో పెరిగారు. ఆమె ఒక అమెరికన్ సమోవా తండ్రి, హిందూ మతంలోకి మారిన తల్లికి జన్మించారు.. గబ్బార్డ్ తన హిందూత్వంపై విశ్వాసం ఉన్న‌ట్లు బహిరంగంగా చెప్పారు.2013లో భగవద్గీతపై తన చేతితో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు.

రాజ‌కీయ‌ప్ర‌స్థానం..

గబ్బార్డ్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2020లో, ఆమె అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన వివాదాల కార‌ణంగా.. ముఖ్యంగా సైనిక జోక్యానికి సంబంధించి కమలా హారిస్ వంటి వారిని ఆమె సవాలు చేస్తూ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసింది. ఆ పార్టీ యుద్ధంపై ఎక్కువ దృష్టి పెట్టిందని, సాధారణ అమెరికన్ల అవసరాలను తీర్చడంలో విఫలమైందని గబ్బార్డ్ విమర్శించారు. 2022 నాటికి, గబ్బర్డ్ అధికారికంగా డెమోక్రటిక్ పార్టీని వీడారు. ఆ వెంట‌నే ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరి డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగ మద్దతుదారుగా మారింది.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో గబ్బర్డ్ పాత్ర

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తుల‌సీ గబ్బార్డ్‌ను నియమిస్తున్నప్పుడు, డొనాల్డ్ ట్రంప్ గబ్బార్డ్‌ను ‘గర్వించదగిన రిపబ్లికన్’ అని కొనియాడారు. జాతీయ భద్రతను పటిష్టం చేయడం, శాంతిని పెంపొందించడంతోపాటు ‘రాజ్యాంగ హక్కుల’ పరిరక్షణకు గబ్బర్డ్ కృషి చేస్తుంద‌ని ట్రంప్ ఉద్ఘాటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version