లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.
డార్జిలింగ్, అనేది భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఇధి పురపాలక సంఘం. ఇది సముద్రమట్టానికి 2,045 మీటర్లు సగటు ఎత్తులో తూర్పు హిమాలయాలలో ఉంది.
లక్షద్వీప్, భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, కేరళ తీరంనుండి 200 నుండి 300 కి.మీ దూరంలో ఉన్నాయి.
మనాలి, హిమాచల్ ప్రదేశ్ లోని పర్వతాలలో కులూ లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది.
ఋషికేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలోని ఒక మునిసిపాలిటీ.పవిత్ర గంగానది ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది.
భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. అదే పేరుతో ఉన్న జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇది ఆంగ్లేయులకు భారతదేశపు వేసవి రాజధానిగా ఉండేది.
మేఘాలయ భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము.