భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ఆలయంలో ఒకే పీఠంపై కనిపించే రెండు శివలింగాల కారణంగా ఈ ఆలయం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ లింగాలను శివుడు, యముడు అని పిలుస్తారు.
కీసరగుట్ట ఆలయం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర గ్రామంలోని కీసరగుట్ట వద్ద శివుడు, పార్వతి అమ్మవారు కొలువుదీరి ఉంటారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయం అని పిలువబడే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలోని ఒక కొండపై ఉంది.
చాయ సోమేశ్వర స్వామి ఆలయం లేదా శైల-సోమేశ్వర ఆలయం అని కూడా పిలువబడే చాయ సోమేశ్వర ఆలయం, నల్గొండలోని పానగల్‌లో ఉన్న ఒక శైవ హిందూ దేవాలయం.
ఐనవోలు : హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీ.శ 1076లో కట్టించాడని చరిత్ర చెప్తోంది.
హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం లేదా రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. దీనిని యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఉంది