Kashi Vishwanath Temple : కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగా నది ఒడ్డున ఉంది.
Kedarnath temple : కేదార్ నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లోని మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంది. ఇది మహాశివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.
Gir Somnath Temple : గుజరాత్ సౌరాష్ట్రలోని వెరావాల్ సమీపంలో ప్రభాస్ పటాన్లో ఉన్న సోమ్నాథ్ ఆలయం, శివుని పన్నెండు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో మొదటిది.
Murudeshwar Temple : కర్ణాటకలోని కందుక కొండపై మురుడేశ్వర దేవాలయం ఉంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహాశివుడి విగ్రహంగా ప్రసిద్ధి చెందింది.
Mallikarjuna temple Srisailam : శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల లో ఒకటి.
Mahakaleshwar Temple : మహాకాళేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది.
Trimbakeshwar Temple : త్రయంబకేశ్వర్ శివాలయం నాసిక్ పట్టణానికి 28 కి.మీ దూరంలోని త్రయంబక్ లో ఉంది త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు.
Brihadeshwara Temple కావేరి నది కుడి ఒడ్డున ఉన్న బృహదేశ్వర ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి. దక్షిణ ద్వారం వద్ద 200 అడుగుల ఎత్తైన భారీ విమానగోపురం ఉంది.
Chidambaram temple చిదంబరం నటరాజ్ దేవాలయాన్ని తిల్లై నటరాజ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని చిదంబరం పట్ణణంలో ఉంది.