Holi 2025 Date and Time : సాధారణంగా ఏటా మార్చిలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది.
చెడుపై విజయానికి ప్రతీకగా ముందు రోజు హోలీ దహన్ అనే భోగి మంటలను వెలిగించడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది
మరుసటి రోజు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ కేరితలు కొడుతూ సందడి చేస్తారు.
రంగుల పండుగ వసంతకాలం ఆగమనాన్ని, కొత్త ఆరంభాలను సూచిస్తుంది. , సామరస్యం, క్షమ, ఆనందాన్ని పెంపొందిస్తుంది.
హోలీ సమాజాలలో సామరస్యాన్ని బంధాలను తెస్తుంది. ప్రజలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు. సంగీతాన్ని ఆస్వాదిస్తారు.
హోలీ ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలలో తిథిని బట్టి వస్తుంది, ప్రధానంగా హిందూ చాంద్ర మాన క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడుతుంది
హోలీకి ముందు రోజు, హోలికా దహన్ లేదా చోటి హోలీ అని పిలుస్తారు, మార్చి 13న తాకాలానికి వీడ్కోలు పలుకుతూ ఈ పండును జరుపుకుంటారు.