Monday, April 21Welcome to Vandebhaarath

Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్

Spread the love

Warangal | తెలంగాణలో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా  ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ (Warangal Narcotics Police Station) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో నూతనంగా నెలకొల్పబడిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ నూతన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తొలి డిఎస్పీ బాధ్యతలు చేపట్టిన సైదులుని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఎస్పీ సాయిచైతన్య అభినందించారు.

ఈ సందర్బంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో లక్ష్యమని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ లో నార్కోటిక్ పోలీస్ స్టేషన్  (Narcotics Police Station) ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యముగా వరంగల్, ఖమ్మం కమిషనరేట్ పరిధితో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలో గంజాయితో ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు విద్యార్థులకు బాల్యం నుంచి మత్తు పదార్థాలపై కల్పించనున్నారని తెలిపారు. అలాగే డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు పాల్పడటం ద్వారా జరిగే అనర్ధాలపై విద్యార్థులు, ప్రజలకు అవగహన కల్పించనున్నట్లు చెప్పారు.నూతనంగా ఏర్పాటు చేసిన ఈ నార్కోటిక్  పోలీస్ స్టేషన్ లో ఒక డిఎస్పీ, ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలు, నాలుగురు హెడ్ కానిస్టేబుళ్ళు, ఏడుగురు కానిస్టేబుళ్ళు పనిచేస్తారని వివరించారు. ఎవరైనా మత్తు పదార్ధాలు విక్రయించినా, వినియోగించినా 1908 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని నార్కోటిక్స్ డైరెక్టర్ తెలిపారు, ఈ కార్యక్రమం ఇన్స్ స్పెక్టర్ రవీందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version