Saturday, April 19Welcome to Vandebhaarath

walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..

Spread the love

walkie-talkies Explosions | జెరూసలేం : లెబ‌నాన్ లో వేల సంఖ్య‌లో పేజర్లు పేలుళ్ల ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.. అది మ‌ర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్ల‌లో బుధ‌వారం మధ్యాహ్నం 20 మంది మరణించ‌గా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్ప‌డు ఎన్న‌డూ ఊహించని విధంగా మ‌లుపులు తిరుగుతోంది.

మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ‘కొత్త దశ’ యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, “మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నాము. దీనికి ధైర్యం, సంకల్పం, పట్టుదల అవసరం. అని అన్నారు. అయితే ఆయ‌న పేలుతున్న పరికరాల గురించి ప్రస్తావించలేదు కానీ ఫలితాలు చాలా బాగున్నాయంటూ ఇజ్రాయెల్ సైన్యం, నిఘా భద్రతా సంస్థల ప‌నితీరును ప్రశంసించారు,

వాకీ-టాకీలు, హ్యాండ్‌హెల్డ్ రేడియోలు, పేజర్‌లతో 3,000 మంది హిజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకుని బుధవారం లెబనాన్‌లోని మూడు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా 20 మంది మరణించారు. కనీసం 450 మంది గాయపడ్డారు. బుధవారం నాటి వరుస దాడులతో మొత్తం సంఖ్య మరణాల సంఖ్య 32కి చేరుకుంది.

 

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version