Saturday, April 19Welcome to Vandebhaarath

vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

Spread the love

vande bharat sleeper coach | భార‌త్ లో వందేభారత్ రైళ్లు ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. అత్యాధునిక సౌక‌ర్యాలు, అత్య‌ధిక వేగం గ‌ల ఈ రైళ్లు దాదాపు వంద‌శాతం ఆక్యుపెన్సీతో ప‌రుగులు పెడ‌తున్నాయి. ప్ర‌యాణ‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్ తో భార‌తీయ రైల్వే వందేభార‌త్ రైళ్ల‌లో అనేక మార్పుల‌ను తీసుకొస్తున్న‌ది. త్వ‌ర‌లో వందే మెట్రో రైళ్ల‌తోపాటు వందేభారత్ స్లీపర్ వెర్ష‌న్ల‌ను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. స్లీప‌ర్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికులు అమితంగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు శ‌ర‌వేగంగా ముందుకు సాగుతోంది.

తాజాగా వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థ కు రైల్వే శాఖ ఇచ్చింది. ఐటల్ సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల సూచ‌న‌ల‌మేర‌కు రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్‌‌ను అత్యాధునిక వసతులతో రూపొందిస్తోంది.

  • vande bharat sleeper coach Features : వందే భారత్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉండ‌నున్నాయి. వీటిలో 11 ఏసీ 3 టైర్, నాలుగు ఏసీ 2 టైర్, రెండు ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటుంద‌ని నివేదిక‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. స్లీప‌ర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్ర‌యాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 మంది ప్ర‌యాణించ‌వ‌చ్చు.
  • అత్యధిక సంఖ్య‌లో ప్రయాణించే ఏసీ 3 టైర్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. వీటిల్లోని బెర్తుల్లో సౌక‌ర్య‌వంతంగా, విలాస‌వంతంగా ఉండేందుకు ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి రాజధాని కంటే ఎంతో చ‌క్క‌గా బెర్తులను త‌యారు చేస్తున్నారు.
  • కోచ్‌లో ఎటుచూసినా క‌ళ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా కనిపించేలా పసుపు, క్రీమ్ రంగులతో ఇంటీయిర్ డిజైన్ చేస్తున్నారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు అన్ని ర‌కాల వారికి అనుకూలంగా ఉండేలా నిచ్చెనను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఆధునిక సెన్సార్ల‌తో ప‌నిచేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్ద కాలుష్యం అంత‌గా లేకుండా నాయిస్ ఇన్సులేషన్, సెలూన్ స్పేస్, దివ్యాంగులకు అనుకూలంగా ఉంటే టాయిలెట్లను రైల్లో ఉన్నాయి.
  • మెరుగైన జ‌ర్నీ ఎక్స్ పీరియ‌న్స్ కోసం ఇంటీరియర్స్‌ను అత్యాధునికంగా తీర్చ‌దిద్దుతున్నారు. పబ్లిక్ అనౌన్స్‌‌మెంట్ వ్యవస్థ, జీఎఫ్‌ఆర్‌పీ పానల్స్, విసువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

  • రైలు ప్ర‌యాణిస్తుండ‌గా కుదుపులు లేకుండా ఉండేందుకు రైల్లో సెమీ పర్మెనెంట్ కప్లర్స్ వినియోగించారు. దీంతో ప్రయాణం మరింత స్మూత్ గా ఉంటుంది.
  • వందేభార‌త్ స్లీప‌ర్‌ రైళ్ల‌లో సెన్సార్ ఆధారిత లైట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగం త‌క్కువ‌గా ఉండేలా అలాగే రాత్రివేళ ప్ర‌కాశవంతంగా ఉండేలా వెలుతురును అందించే లైట్లను వినియోగిస్తున్నారు. సులువుగా నడిచేందుకు వీలుగా రైలు ఫ్లొర్‌లను తీర్చ‌దిద్దుతున్నారు.
  • రైలు టాయిలెట్లలో దుర్వాసన రాకుండా ప్ర‌త్యేక‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మాడ్యులార్ ఫిట్టింగ్స్‌తో కూడిన బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఇందులో చూడ‌వ‌చ్చు. వాష్ బెసిన్స్‌లో యాంటీ స్పిల్లేజ్ ఫీచర్లు.. నీరు ప‌రిస‌రాల్లో చిందకుండా చేస్తాయి.
  • ప్ర‌యాణికులు ఒక కోచ్ మ‌ధ్య న‌డ‌వ‌డానికి వీలుగా పూర్తిగా మూసి ఉంచిన గ్యాంగ్ వేస్‌ను డిజైన్ చేశారు. ఇది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాదిరిగానే ఉంటుంది.
  • వందేభార‌త్ సెమీ హైస్పీడ్ రైళ్లు గరిష్ఠంగా గంట‌కు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నమూనా రైలును గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద పరీక్షిస్తున్నారు. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చిన త‌ర్వాత‌ రాత్రి ప్రయాణాల సమయం బాగా తగ్గుతుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version