Saturday, March 1Thank you for visiting

Ugadi Panchangam karkataka Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

Spread the love

karkataka Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కర్కాటక రాశి వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 14
  • వ్యయం – 2
  • రాజపూజ్యం – 6
  • అగౌరవం – 6
ఈ సంవత్సర కర్కాటక రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు లాభ స్థానంలో, బృహస్పతి , శని అష్టమ స్థానం , భాగ్య స్థానంలో, అలాగే  కేతువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు..
Ugadi Panchangam karkataka Rasi Phalalu  శ్రీ కోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి (Cancer Sign ) వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు అని గ్రహిస్తారు. నమ్మిన వారు మోసం చేయడం వలన మానసికంగా కొంత కుంగిపోతారు. శరీరంలో దాగివున్న పాత రోగాలు తిరగబడతాయి. విద్యార్థులకు యోగదాయకమైన కాలం. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం.
కుల సంఘాల ప్రోత్సాహం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సొమ్ము కొంత దొంగల పాలవుతుంది. వ్యాపార స్థలములో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి.

ఈ రంగాల వారికి శుభాలు

 విదేశీ యాన ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. Real Estate, Construction రంగంలో ఉన్నవారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేసే వారికి నష్టాలు కలుగుతాయి. పాలు, కూరగాయల వ్యాపారం చేసే వారికి ఆదాయం పెరుగుతుంది. మిర్చి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆశ్లేష నక్షత్ర స్త్రీలు బంగారం చేజార్చుకునే అవకాశం కలదు. రాజకీయరంగంలో ఉన్నవారికి గడ్డు కాలము. సోదరుల సహాయంతో కొంత అప్పు తీర్చగలుగుతారు.
Panchangam karkataka Rasi Phalalu జ్యోతిష్య వృత్తిలో ఉన్న వారికి అపకీర్తి తప్పదు. కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. పుష్యమి నక్షత్ర జాతకులకు మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులను అతిగా నమ్మకూడదు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల సమయం. వేళ తప్పిన భోజనం ఉంటుంది. Medicine Manufacture వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. Cement & Hardware వ్యాపారస్తులకు నష్టాలు కలుగును. వీలైనంతవరకు అప్పు చేయకూడదు. ఈ రాశి వారు శనికి జపం చేయించి తగు దానాలు చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చెప్పదగిన సూచన.

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version