Tuesday, March 4Thank you for visiting

TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

Spread the love

TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ..  ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Free Bus scheme ) వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

TSRTC Latest News : ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి.. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా టైం పడుతోంది. ఫలితంగా బస్సు సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగిపోతోంది.. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఆలోచనతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని Tsrtc సంస్థ నిర్ణయించింది. సోమవారం (జనవరి 1, 2024) నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version