Friday, May 9Welcome to Vandebhaarath

TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌

Spread the love

 

TS Mahalakshmi Scheme : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం అర్హులకే అందించాలని చూస్తోంది. ఈ ఆరు పథకాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం. రూ.500లకే వంట గ్యాస్‌, మహిళలకు నెలకు రూ.2,500 వంటి పథకాలు ప్రజలను ఆకర్షించాయి. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి… గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో… కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీ పథకాల కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పథకాల అమలు కోసం… దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేశారు. ఈ క్రమంలో… రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుందని ఎంతో మంది భావించారు.

కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం… తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టింది. అంటే.. బీపీఎల్‌ అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్‌ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో… మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు.

హైదరాబాద్‌ మహానగర పరిధిలో చాలా మందికి రేషన్‌ కార్డులు లేవు. గత పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు మొక్కబడిగా తప్పితే… పూర్తిస్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో రేషన్ కార్డు లేని పేద కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు.. మహాలక్ష్మి పథకం కింద… వారికి సబ్సిడీ గ్యాస్‌ వస్తుందా..? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కొత్త రేషన్‌ కార్డులిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నా… అందుకు పలు నిబంధనలు వర్తిస్తాయి. ఈ విధానం కారణంగా దిగువ మధ్యతరగతి ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. నిరుపేదలకు మాత్రమే.. సిలిండర్‌ సబ్సిడీ వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

ఓటు హక్కు ఉంది.. రేషన్ కార్డు లేదు.. ఎలా..?

TS Mahalakshmi Scheme మరోవైపు హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో… జనాభా అధికంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్నా… వారు రేషన్‌ కార్డు ఇప్పటికీ అందుకోలేకపోయారు. ఇలాంటి వారి పరిస్థితి ఏంటి..? వీరిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో పది లక్షల వరకు అనధికార కనెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే… తెల్ల రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలు మాత్రం 17.21 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు రేషన్‌ కార్డులు లేవు. వీరిలో బీపీఎల్ కుటుంబాలు మరో 10 లక్షల వరకు ఉండవచని సమాచారం. మరి.. మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

ప్రస్తుతం.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955. దీనికి తోడు సిలిండర్ ను ఇంటికి తీసుకువచ్చిన డెలీవరీ బాయ్‌ కి రూ.30 నుంచి 50 వరకు చెల్లిస్తుండగా సిలిండర్‌ ధర సుమారు రూ.వెయ్యి అవుతోంది.  కాగా ఆరు గ్యారంటీ స్కీమ్ లలో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద అర్హత పొందినవారికి సిలిండర్ కేవలం రూ.500కే వచ్చే అవకాశాలున్నాయి. అయితే.. తమకు సబ్సిడీ రావాలని చాలా మంది ఆశపడతారు. కానీ… తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరని కాంగ్రెస్‌ రూల్‌ పెట్టడంతో… కార్డు లేనివారికి నిరాశే ఎదురువుతోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version