Friday, March 14Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

Trending News
సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. @koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. నిండుగా చీర ధరించి మూడు చిన్న బంతులను గాలిలో ఎగురువేస్తూ ఒక రింగ్ తో హులా హూప్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. "ఆమె ప్రతిభకు తనదైన రీతిలో నిర్వచనం.. ట్రెండింగ్ పాటలకు ట్రెండింగ్‌ను సృష్టిస్తోంది" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఒక పుస్తకాన్ని దాని కవర్‌ని బట్టి అంచనా వేయవద్దు" అని మర...

వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి

Trending News
సోషల్ మీడియాలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాలలోనే వైరల్ అయింది. ఒక వ్యక్తి ముందు సీటులో ఊహించని ప్యాసింజర్ తో కలిసి కారు నడుపుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి తన పెద్ద కొమ్ములు కలిగిన భారీ ఎద్దుతో కారు నడిపాడు. ఇప్పుడు, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, వేగంగా షేర్ అవుతోంది. ఆసక్తికరమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. (Giant-Horned Bull viral video) ఈ వీడియోలో ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చూపిస్తుంది. ముందు సీటులో భారీ ఎద్దు ఉంది. ఎద్దు తల కారు కిటికీలోంచి బయటకు వస్తూ, రద్దీగా ఉండే నగరంలో ప్రయాణిస్తుంది. పోలీసులు అతడిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాలను  అటుగా వెళ్తున్న వ్యక్తులు తమ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Nebraska police pull over man with a #bull ...

హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ ప్రత్యక్ష ప్రసారం

Trending News
Aditya-L1 launch: హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శనివారం ఆదిత్య-ఎల్1 లాంచ్ కుసంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం (ఆన్‌లైన్) ద్వారా చూడవచ్చు. 'సూర్యుడికి సంబంధించిన విశేషాలు, ఆదిత్య-ఎల్ 1 మిషన్'పై సైన్స్ చర్చ కూడా జరుగుతుందని బిఎమ్ బిర్లా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం(hyderabad birla planetarium) డైరెక్టర్ కెజి కుమార్ తెలిపారు. " మధ్యాహ్నం 12 గంటలకు ‘Our Sun' పై ఓపెన్ హౌస్ క్విజ్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు బిర్లా ప్లానిటోరియంకు వచ్చి లాంచ్‌ని వీక్షించవచ్చు.. తరువాత క్విజ్‌లో పాల్గొనవచ్చు," అని తెలిపారు. ఆదిత్య L1 గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సూర్యుడి వైపు వెళ్లేందుకు భారతదేశం నుంచి ఇది మొట్టమొదటి మిషన్. 'ఆదిత్య' అంటే సూర్యుడు అని, ఎల్1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అని అర్థం. ఇది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఏడు వేర్వేరు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. వీ...

మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..

Trending News
తల్లి లేని చిన్నారిని ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అపురూపంగా చూసుకుంటున్నాడు. పాపకు తల్లి లేదనే బాధ మనసులోకి రాకుండా ప్రేమగా పెంచుకుంటున్నాడు థాయిలాండ్ కు చెందిన 48ఏళ్ల ప్రాచ్చ దీబూ(Prachya Deebu). కుమార్తె పేరు  నట్టవాడీ కోర్ంజన్ (Nattawadee Kornjan) కాగా ప్రేమగా క్రీమ్ అని పిలుచుకుంటన్నాడు. అయితే ఇటీవల కూతురు చదువుకుంటున్న స్కూల్ లో మదర్స్ డే వేడుకలు జరిగాయి. అందరు పిల్లలు తమ తల్లులను తీసుకొచ్చారు. కానీ తన 15 ఏళ్ల కుమార్తెకు తల్లి లేకపోవడంతో అమె తరపు వారెవరూ హాజరుకాలేదు. ఇక్కడే దీబూ చేేసిన పని అందరి హృదయాలను కదిలించింది.  దీంతో తన కుమార్తె కోసం ఒక తల్లిమాదిరిగా మహిళ దుస్తులతో స్కూల్ కు వచ్చి తన కూతురితో కలిసి మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. దీబు  పాఠశాలలో మాతృ దినోత్సవ వేడుక (Mother’s Day celebrations)లకు హాజరైనప్పుడు తన కుమార్తెతో కలిసి తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస...

నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..

Trending News
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నిద్రలేస్తుండగానే ఆమె కాళ్లకు కాలనాగు చుట్టుకొని బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అది ఎక్కడ కాటేస్తుందోనని భయాందోళనతోనే అది ప్రశాంతంగా వెళ్లిపోయేవరకు వేచి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏకంగా మూడు గంటలపాటు అలాగే కూర్చుండిపోయింది. పాము తనంతట తానుగా వెళ్లిపోవాలని కదలకుండా ఉండిపోయింది. మూడు గంటలకు పైగా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. దహర్రా గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉన్న మిథ్లేష్ యాదవ్ సోమవారం ఉదయం తన కాలుపై ఏదో పట్టుకొని ఉన్నట్లు అనిపించింది. లేచి చూడగా ఓ రాచనాగు (కింగ్ కోబ్రా) తన కాలు చుట్టూ చుట్టుకొని ఉంది. వెంటనే ఆమె చేతులు జోడించి, క్షేమంగా విడిచిపెట్టాలని ప్రార్థించింది. “నేను నా ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాను. నేను మేల్కొన్నప్పుడు.. నా కాలుకు పాము చుట్టుకోవడం...

వైరల్ వీడియో : గారడీ చేసినట్లు ఫిల్టర్ కాఫీ ఎలా చేశాడో చూడండి..

Trending News
ఫ్యాన్సీ కేఫ్‌లు, కార్పొరేట్ కాఫీ చెయిన్‌లు  ఎన్నో ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన ఉండే సాంప్రదాయ ఫిల్టర్ కాఫీల రుచులను ఎన్నటికీ మరిచిపోలేము. వేడివేడి ఫిల్టర్ కాఫీ సేవిస్తే మీ ఆలోచనలన్నీ రీఫ్రెష్ అవుతాయి.  అయతే ఇటీవల కాఫీ తయారీకి సంబంధించిన ఒక వైరల్ వీడియో చూస్తే వెంటనే ఆ కాఫీని ఆశ్వాదించాలనిపిస్తుంది. కాఫీ తయారు చేయడంలో ఈ చెఫ్ ప్రదర్శించిన నైపుణ్యం కారణంగా ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ (instagram) ఫుడ్ వ్లాగర్ 'ఫుడీయాడిక్ట్' షేర్ చేశారు. అది పాండిచ్చేరిలోని స్థానిక కాఫీ బార్‌లో రికార్డ్ చేయబడిందని క్యాప్షన్ లో పేర్కొన్నారు. క్లిప్ త్రిభుజాకార ఆకృతిలో పేర్చిన సాసర్‌లో 10 మెటల్ గ్లాసులు ఉన్నాయి. చెఫ్, చక్కెరతో నిండిన పాత్రలను పట్టుకుని, టేబుల్‌కి అడ్డంగా నిలబడి చూడవచ్చు. కేవలం రెప్పపాటు సమయంలో, చెఫ్ అన్ని మెటల్ గ్లాసుల్లో చెక్కెరను వేయడం ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది...

చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​

Trending News
  Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇండియా సంచలనం సృష్టించింది. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. ఒక్కో దశ దాటుకుంటూ ల్యాండర్​ విక్రమ్​ చందమామను చేరుకుంటుంటే బెంగళూరు ఇస్రో కేంద్రంలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. అది చూసిన జనాల మోముల్లోనూ అమితానందం వెల్లివిరిసింది. చంద్రయాన్​3 సేఫ్​గా ల్యాండింగ్​ కావడంతో అందరూ హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చం ద్రయాన్ -3 ప్రాజెక్టు దిగ్విజయమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించింది. జాబిలి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్​ అయ్యింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ నిర్ణీత సమయానికి చంద్రుడిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు టెన్షన్​ కు గురయ్యా...

Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Trending News
Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమైంది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత తదుపరి మిషన్. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగష్టు 6, 9, 14, 16వ తేదీలలో అలాగే ఆగస్టు 17న రోవర్, ల్యాండర్.. రెండు మాడ్యూళ్ళను వేరు చేయడానికి ముందు కక్ష్య తగ్గించే విన్యాసాలు జరిగాయి. Chandrayaan 3 soft landing : ఈరోజు ఏం జరగనుంది? సాఫ్ట్ ల్యాండింగ్ (soft landing ) అంటే అంతరిక్ష ...

రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో ‘శుభ ముహూర్తం’ ఫిక్స్ చేసుకున్న దొంగలు

Trending News
చివరకు పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితులు మహారాష్ట్రలోని బారామతిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అది కూడా శుభ మహూర్తంలో చేయాలనుకునున్నారు. ఈ క్రమంలో ఆ దొంగల బృందం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి అతడికి ఫీజుగా రూ.8 లక్షలు చెల్లించింది. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పెంపించివేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్ నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీ కార్మికులు" అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గ...

Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Trending News
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది.. చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూ...
Exit mobile version