
ATM on Wheels | నడుస్తున్న రైలులో డబ్బు డ్రా చేసుకోవచ్చు.. వీడియో చూడండి
ATM on Wheels : సువిశాలమైన భారత దేశాన్ని అనుసంధానించడానికి భారతీయ రైల్వేల కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. చాలా రైళ్లు దేశంలోని ఒక చివర నుంచి మరో చివరకు ప్రయాణించడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణంలో మీ జేబు ఖాళీ కాకుండా చూసుకోవడానికి, రైల్వేలు రైళ్లలో ATMల కోసం ఏర్పాట్లు చేయబోతున్నాయి. దీని కోసం సెంట్రల్ రైల్వే కూడా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది.
కాబట్టి ఇప్పుడు మీకు రైలు ప్రయాణంలో ఉండగా నగదు అవసరమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు దారిలో ఏ స్టేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు, లేదా మీరు ఏ స్టేషన్‌లో దిగాల్సిన అవసరం కూడా లేదు. రైల్వేస్ ఇప్పుడు కదులుతున్న రైళ్లలో ATMలను ఏర్పాటు చేయబోతోంది. ఈ ATM ఆన్ ది వీల్ అనే భావన చాలా ప్రత్యేకమైనది.
మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌లో ATM on Wheels
మన్మాడ్-ఎంఎస్‌ఎంటీ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్...