Saturday, April 19Welcome to Vandebhaarath

Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..

Spread the love

Jobs in Dubai | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), దుబాయ్(Dubai ), యుఎఇ (UAE)లో డెలివరీ బాయ్స్ (Delivery Boy) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్య‌ర్థుల‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17, గురువారం, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాల‌ని కోరింది.

యుఎఇలోని దుబాయ్‌లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్)కి అధిక డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగస్తుల‌కు ఆకర్షణీయమైన వేత‌న ప్యాకేజీ అందిస్తాయి. సురక్షితమైన మరియు చట్టపరమైన వలసల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో TOMCOM అభ్యర్థులకు సహాయం చేస్తుందని TOMCOM ఒక పత్రికా ప్రకటన తెలిపింది.

అయితే ఈ ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం SSC ఉత్తీర్ణులై ఉండాలి. పాస్‌పోర్ట్ మరియు 3 సంవత్సరాల భారతీయ ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్, 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య కనీస వయోపరిమితిని కలిగి ఉండాలి. ఇప్పటికే ఉన్న ఫుడ్ డెలివరీ అప్లికేషన్లలో డెలివరీ చేసే వ్యక్తులు ప్రాధాన్యతనిస్తారు. వివరాలకు: 94400-51285/ 94400-48500 ఫోన్ నెంబ‌ర్ల‌లో సంప్ర‌దించవ‌చ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version