Saturday, March 1Thank you for visiting

Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.

Spread the love

Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి
దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్
వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది
తప్పిపోయిన విషయం తెలిసిందే.  అయితే ఈ వాహనం ఆచూకీ కనుగొనేందుకు.. అందులో ఉన్న ఐదుగురు బిలీనియర్లను కాపాడేందుకు అట్లాంటిక్ మధ్యలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. టైటాన్లో కేవలం 96 గంటలకు మాత్రమే సరపడే ఆక్సిజన్ నిల్వలే ఉండటంతో అనుణక్షణం ఉత్కంఠగా మారింది. దీంతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు. అయితే అధిక తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) ఒక్కసారిగా పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో
కొన్ని శకలాలను గుర్తించనట్లు గార్డ్ తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలోనే 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను కనుగొన్నట్లు పేర్కొంది.

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఎవరు ఉన్నారు?

Titanic submarine లో పాకిస్తాన్ కు చెందిన బిలీయనీర్ షెహజాదా దావూద్(48) తోపాటు ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉండే బ్రిటన్ కు చెందిన బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఈ యాత్ర నిర్వహకుడు ఓషన్ గేట్ తోపాటు కంపెనీ వ్యవస్థాపకుడు అయిన స్టాక్టర్ రష్ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. బీబీసీ ఒక నివేదిక ప్రకారం, కనుగొనబడిన శిధిలాల నమూనాల ఆధారంగా టైటాన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు బహుశా పేలుడు కారణంగా మరణించారని కోస్ట్ గార్డ్‌కు చెందిన రియర్ అడ్మ్ మౌగర్ ధృవీకరించారు.

 టైటానిక్ శిధిలాలు ఎక్కడ ఉన్నాయి?

ఐకానిక్ షిప్ “టైటానిక్” ఏప్రిల్ 1912లో మంచుకొండను ఢీకొన్న తర్వాత  మునిగిపోయింది. దీని శిథిలాలు న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణంగా 435 మైళ్ళు (700 కిమీ) దూరంలో ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర ఉపరితలం నుండి రెండు మైళ్ల కంటే ఎక్కువ (దాదాపు 4 కిలోమీటర్లు) దిగువన ఉన్నాయి. Titanic submarine కు 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఓడ పేలకపోతే గురువారం ఉదయం వరకు ఆక్సిజన్ సరఫరా క్షీణించడం వల్ల అందులో ఉన్నవారు చనిపోయే అవకాశం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలోని  అట్టడగు భాగాన అత్యంత చల్లటి నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ప్రయాణికులు అల్పోష్ణస్థితికి  గురయ్యే ప్రమాదం కూడా ఉంది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version