
Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా తెలుగురాష్ట్రాల ప్రజలకు టీజిఎస్ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది.
సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధాన బస్ టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి, సర్వీసులు స్థానిక ప్రాంతాల నుంచి నడిపించనున్నారు.
APSRTC : ఏపీలోనూ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) సైతం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 1000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిన్న ప్రకటించింది. వెయ్యి బస్సుల్లో దూర ప్రాంతాలకు 200 సర్వీసులు నడపగా.. విజయనగరం జోనల్ రేంజ్‌లో 800 బస్సులు నడిపించనున్నట్లు వెల్లడించింది. వైజాగ్ నుంచి గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్ రైడర్, క్రూయిజ్, అల్ట్రా డీలక్స్ సర్వీస్‌లు దూర ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..