
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం
రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి..
న్యూయార్క్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో
మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. న్యూయా ర్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసిన ట్లు ఆయన గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలం గాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖ ట్విట్టర్...