వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..
దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ
సుమారు 4వేల మందికి ఉపాధి
ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అ...