Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..
Holi special trains : హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్టమైన వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చర్లపల్లి రైల్వే టెర్మినల్, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.
ఈ స్టేషన్లలో హాల్టింగ్
ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...