
Telangana news : మహిళా దినోత్సవం (Womens Day 2025) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు కొత్తగా గోదాములు, రైస్ మిల్లుల బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భవనాలు ఉండాలని నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంఘం భవనానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు.
మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు
Telangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల (Solar power Plants)ను మహిళా సంఘాల()కు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. మహిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్వహించి విద్యుత్ శాఖకు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు ఆర్టీసీ (TGSRTC)ఎలక్ట్రిక్ బస్సుల లీజులను మహిళలకు అప్పగించామని అన్నారు. మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులు లీజుకు ఇస్తున్నాయని, ఈరోజు 150 ఎలక్ట్రిక్ బస్సులు (EV Buses) ఆర్టీసీకి సంఘాలు అందజేశాయని చెప్పారు. హైటెక్ సిటీ పక్కన ఇన్పోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థల సమీపంలో మహిళా సంఘాలకు 150 షాపులను ఇప్పటికే కేటాయించినట్లు సీఎం గుర్తు చేశారు. మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ కార్పొరేట్ సంస్థలతో పోటీపడాలన్నారు.
రైస్‌మిల్లులు, గోదాముల బాధ్యతలు కూడా
సమీప భవిష్యత్ లో ప్రతీ మండల కేంద్రంలో మహిళా సంఘాల (Self Help Gorups)ఆధ్వర్యంలో రైస్ మిల్లులు (Rice mills), గోదాములు (godown) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాల కొనుగోలు చేసే ధాన్యాన్నిఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం మహిళా సంఘాలు చేపట్టేలా సర్కారు ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణాలకు అవసరమైన రుణాలను కూడా ఇప్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.