
Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు సవరణకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వహించేలా షెడ్యూల్ చేశారు.
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది.
అభ్యర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రీవియస్ సర్వీస్ కోసం 20 పాయింట్లు. నర్సింగ్ ఉద్యోగాల అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉంటుంది. నిర్దిష్ట వర్గాలకు సడలింపులు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ప్రక్రియలో రూ. 500 పరీక్ష రుసుము. రూ. 200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే SC, ST, BC, EWS, PH అభ్యర్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వారి నర్సింగ్ సర్టిఫికెట్లు, ఇతర కమ్యూనిటీ సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరిస్తారు. మరిన్ని వివరాల కోసం అలాగే దరఖాస్తు కోసం, అభ్యర్థులు MHSRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి .
Govt Jobs in Medical Deportment మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్‌లో వివిధ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 6న రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియకు నోడల్ అధికారులుగా వైద్య విద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్‌ను నియమించారు. హైదరాబాద్‌లోని రెండు ఆసుపత్రులలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లతో సహా వివిధ ఉద్యోగ స్థానాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టారు.
ఉస్మానియా ఆసుపత్రిలో ఈ క్రింది విధంగా పోస్టులు ఉన్నాయి.
- 8 ప్రొఫెసర్లు,
- 23 అసోసియేట్ ప్రొఫెసర్లు,
- 111 అసిస్టెంట్ ప్రొఫెసర్లు
- 33 సీనియర్ ట్యూటర్లు,
- మొత్తం 175 పోస్టులు.
గాంధీ ఆస్పత్రిలో
- 3 ప్రొఫెసర్లు,
- 4 అసోసియేట్ ప్రొఫెసర్లు,
- 140 అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
- 29 సీనియర్ ట్యూటర్లు
- మొత్తం 235 పోస్టులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..