Monday, March 3Thank you for visiting

ఏడు పదుల వయసులో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..

Spread the love

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడు పదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నేతలు సైతం ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించాలని కొందరు సీనియర్లు భావించినా ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలు వారికే టికెట్లు ఖరారు చేయడంతో వారు పోటీలో నిలుచున్నారు. దశాబ్దాలుగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వర్తించిన సీనియర్ నాయకులు ఈసారి ప్రత్యర్థులతో తలపడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీరిలో ముఖ్యంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వర రావు వయసు 79 ఏళ్లు.. తన రాజకీయ వారసుడైన వనమా రాఘవ.. ఓ మహిళను వేధించిన కేసులో జైలు కు వెళ్లడంతో ఇబ్బందులు వస్తాయని నాలుగో సారి వనమా వెంకటేశ్వరరావు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి ఈ ఐదేళ్లు పూ ర్తయితే ఆయన వయసు 84 ఏళ్లు కానుంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వనమా.. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వర రావు పోటీలో నిలిచారు. ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు పనిచేసిన తుమ్మల.. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ తో తలపడుతున్నారు..
ఇక మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస రెడ్డి వయసు 74 ఏళ్లు. కురువృద్ధుడైన పోచారం.. తన కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంగీకరించలేదు. దీంతో మరోసారి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోచారం బరిలోకి దిగారు. ఇక ఆదిలాబాద్ జిల్లాపరిషత్ చైర్మన్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసిన అల్లోల ఇంధ్రకరణ్ రెడ్డి వయసు 74 ఏళ్లు.. తన కంటే తక్కువ వయసున్న ప్రత్యర్థులతో అల్లోల ఎన్నికల సమరంలో నిలిచారు.
మరోవైపు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, జాతీయ విపత్తుల సంస్థ సభ్యుడిగా సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి వయసు 74 ఏళ్లు.. సీఎంగా పనిచేసిన తన తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి.. ఈసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఐదు సార్లు విజయం సాధించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి వయసు 71 ఏళ్లు. ఈయన మరోసారి సూర్యాపేట నియోజకవర్గ బరిలోకి దిగారు.

పోటీ నుంచి తప్పుకున్న సీనియర్లు

సీనియర్ నేతలు కుందూరి జానారెడ్డి, గీతారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పట్నం మహేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, మల్లు రవి తదితరులు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి వయసు ఆటంకం కాదని నిరూపిస్తూ పలువురు సీనియర్ నేతలు ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version