Monday, April 21Welcome to Vandebhaarath

త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Spread the love

Digital Health Cards : రాష్ట్రంలో అంద‌రికీ డిజిట‌ల్ హెల్త్ కార్డులు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)  తెలిపారు. ప్రాణాంతక క్యాన్స‎ర్‎ మహ్మమారితో ఎంతో మంది చనిపోతున్నారని.. ఈరోజు కూడా ఒక‌ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని అన్నారు. హైదరాబాద్‎ విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేసి త‌ద్వారా ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అంద‌జేస్తామ‌ని, రాష్ట్రంలోని పేదలంద‌రికీ నాణ్య‌మైన‌ వైద్యం అందుబాటులోకి తెస్తామని.. చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version