
Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజయ్ (Bandi Sanjay) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ పదవి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిషన్‌రెడ్డి (G Kishan Reddy) ఉండగా సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మళ్లీ బండి సంజయ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
Telangana BJP president post : బండి సంజయే ఎందుకు?
తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజయ్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల (state Assembly elections) ముందు తప్పించి కిషన్ రెడ్డిని నియమించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం మళ్లీ బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించాలని పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఆయన బలమైన బీసీ నేత కావడంతో పాటు తెలంగాణలో హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నారని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ 150 స్థానాల్లో 46 గెలుచుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ 99 స్థానాల నుంచి 56కి పడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) 20 శాతం ఓటు షేర్‌తో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2018లో బీజేపీ కేవలం 7 శాతం ఓటు షేర్‌తో ఒక అసెంబ్లీ సీటుతో పరిమితమై ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 17 స్థానాల్లో 8 గెలుచుకుంది. ఈ ఫలితాలు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన విపక్షం బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర స్థాయిలో మరింత బలపడేందుకు బండి సంజయ్‌ను ముందుకు తేవాలనే యోచనలో ఉంది.
బీసీ నేత అయినందుకేనా?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణన వివరాల ప్రకారం బీసీల జనాభా 46 శాతంగా ఉంది (ముస్లింలను మినహాయిస్తే). అయితే, ముస్లింలను కలిపితే ఈ శాతం 56 శాతానికి చేరుకుంటుంది. దీంతో బీసీ వర్గాలు మరిన్ని రాజకీయ హక్కులను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ నేత అయిన బండి సంజయ్‌ను తిరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈటల రాజేందర్‌కు అవకాశం లేదా?
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Malkajgiri MP Eatala Rajender) పేరు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన కూడా బలమైన బీసీ నేతగా ఉన్నారు. అయితే, గతంలో ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన కారణంగా ‘అవుట్‌సైడర్’ అనే నెగటివ్ ట్యాగ్ ఆయనకు తగిలింది. దీంతో ఈ పదవి పొందే అవకాశాలు తగ్గినట్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.