Friday, April 18Welcome to Vandebhaarath

తెలంగాణలో రేపే కౌంటింగ్‌.. ఉదయం 10 గంటల్లోపు తొలి ఫలితం

Spread the love

Telangana Election Results: తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.

Telangana Assembly Election Counting: మరికొద్ది గంటల్లోనే తెలగాణ ఎన్నికల కౌంటింగ్‌ షురూ కానుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా… ఆదివారం ఉదయం 10 గంటల వరకు తొలి ఫలితం వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూంలకు తరలించామని, ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచామని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల ప్రాంతానికి ఎవర్నీ రానివ్వడం లేదు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంది. డీసీపీలు, సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు స్ట్రాంగ్‌ రూం లవద్ద పహారా కాస్తున్నాయి. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.

హైదరాబాద్ లో అత్యధికం..

తెలంగాణ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 49 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు .

మూడంచల భద్రత

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కు మొత్తం 17,66 టేబుళ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ బూత్ ల కంటే ఎక్కువగా ఉన్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లు, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఒక్కో టేబుల్‌ వద్ద మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది.

ఇదిలా ఉండగా పోస్టల్‌ బ్యాలెట్‌ల కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి జరుగుతుంది. లక్షా 80 వేల మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వికాస్ రాజ్ వివరించారు.
తెలంగాణ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు ఉండగా.. వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. తెలంగాణలో మొత్తం 71.06 శాతం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ నమోదు కాగా, యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు వికాస్ తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం పోలింగ్‌ తగ్గిందని వివరించారు. . రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌కు ఛాన్స్ లేదని సీఈవో వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు.

మొత్తం కౌంటింగ్‌ టేబుళ్లు‌ 1,766
ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుళ్లు‌‌14
6 నియోజకవర్గాల్లో .. కౌంటింగ్‌ టేబుళ్లు 28


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version