Saturday, April 19Welcome to Vandebhaarath

కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామ‌లై..

Spread the love

Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో ఉద్య‌మించారు. బాధితురాలి ప‌ట్ల‌ అధికార డీఎంకే, రాష్ట్ర పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ తనదైన శైలిలో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ అధినేత తనను తాను కొరడా ఝుళిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చెన్నైలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై అధికార డీఎంకే ప్రభుత్వానికి నిరసనగా తాను 48 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, చెప్పులు లేకుండా ఉంటానని కె. అన్నామలై గురువారం ప్రకటించిన విష‌యం తెలిసిందే..
నిన్న‌ విలేఖరుల సమావేశంలో అన్నామలై తన షూ తొలగించి, “రేపటి నుంచి డిఎంకెను గ‌ద్దె దించేవ‌ర‌కు తాను ఎలాంటి పాదరక్షలు ధరించను, అన్నా యూనివర్శిటీ (Anna University) విద్యార్థినిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కె. అన్నామలై శుక్ర‌వారం నుంచి నిరసన తెలుపుతాన‌ని ప్ర‌క‌టించారు. ‘‘రేపు నా ఇంటి ముందు నేనే ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటాను. రేపటి నుంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తా.. ఆరడుగుల మురుగన్‌కి విజ్ఞప్తి చేస్తా.. రేపు నిరసన కార్యక్రమం. రేపటి నుంచి డీఎంకేను అధికారం నుంచి తప్పించే వరకు నేను చెప్పులు వేసుకోను’’ అని అన్నామలై (BJP President Annamalai) అన్నారు.

చెన్నైలోని అన్నా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు వ్యతిరేకంగా బీజేపీ, ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలో గురువారం జరిగిన నిరసనలు చేపట్టింది. దీంతో బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అస‌లేం జ‌రిగింది.

గ‌త సోమవారం రాత్రి అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో రెండో సంవత్సర విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, నిందితులు విద్యార్థిని లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు.

స్పందించిన న‌టుడు విజ‌య్ (TVK Chief Vijay)

ఇదిలా ఉండ‌గా నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ (TVK Chief Vijay) ఈ సంఘటనను “తీవ్ర దిగ్భ్రాంతికరమైనదని, బాధాకరమైనది” అని అభివర్ణించారు, నేరస్థుడిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. “దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేసినప్పటికీ, త్వరితగతిన చట్టపరమైన చర్యలు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ నేరంలో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లయితే, వారు కూడా వెంటనే జవాబుదారీగా ఉండాలి. అని విజయ్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version