July Rashi Phalalu | జూలై మొదటి వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఫలితాలు.!
July Rashi Phalalu | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 30 ఆదివారం నుంచి జూలై 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం ( 30’th June - 6’th July ) లో సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సోదరుల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా Emotionalగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. Navy & Defence Department ఉద్యోగస్...