Young India Skills University | స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంపై సర్కారు కీలక నిర్ణయం..
Hyderabad Skills University | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University)కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ (Megha Company) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో యూనివర్సిటీ ప్రాంగణంలో అన్ని భవనాలను నిర్మించే బాధ్యతలను మెఘాకంపెనీ తీసుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధు...