Wednesday, March 5Thank you for visiting

Tag: world news

Donald Trump : ఆ న‌ర‌కానికి ముగింపు ప‌లుకుతాం.. ! హ‌మాస్‌కు ట్రంప్‌ మాస్ వార్నింగ్‌..

World
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంత‌మ‌వుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. "ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీల‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే చాలా మంది హ‌త్య‌కు గుర‌య్యారు. "వారు ఇకపై బందీలుగా ఉండ‌రు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్ల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చార...

US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్

World
US Election Results 2024 : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం US అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించి, అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ గ‌త పదవీకాలం ముగిసిన నాలుగు సంవత్సరాల తర్వాత వైట్ హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. నెట్‌వర్క్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు, అధ్యక్ష పదవిని సాధించడానికి అవసరమైన 270-ఓట్ల థ్రెషోల్డ్‌ను అధిగమించారు, ఇంకా 35 ఎలక్టోరల్ ఓట్లు మిగిలి ఉన్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లలు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ విజయం అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా, వరుసగా పదవీకాలం కొనసాగకుండా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు ట్రంప్. ఈ విజయంతో, 132 సంవత్సరాల అమెరిక...

UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?

World
Middle East crisis | ఇరాన్‌ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్‌ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించలేదని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకారం, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడిని, అక్టోబర్ 7న హమాస్ దాడులను ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించ‌లేదని ఆరోపించారు. అందుకే ఆయ‌ను దేశంలోకి రాకుండా నిషేధించించిన‌ట్లు వెల్ల‌డించారు... ఈ చర్యలను ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదని కాట్జ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ మద్దతు ఉన్నా లేకున్నా తమ‌ దేశ‌ పౌరుల...

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

World
Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాప...

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

World
Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది.   Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack...

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...

Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

World
Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ( Afghanistan's Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి పైగా గాయపడ్డారని పజ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ నివేదించింది. Afghanistan earthquake అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిందా జాన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ.. నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని "జిందా జాన్" జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది గాయపడ్డారని టోలో న్యూస్ నివ...
Exit mobile version