Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..
Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్లడించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివరించింది.
దీని ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్...