Saturday, March 15Thank you for visiting

Tag: Wayanad

PM Modi in Wayanad | వాయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా.. 

National
PM Modi in Wayanad | ప్ర‌కృతి విల‌యంలో విల‌విల‌లాడుతున్న వాయనాడ్‌లో పునరావాస కార్యక్రమాలపై ఆశలు రేకెత్తిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆగస్టు 10న కేర‌ళ‌లో పర్య‌టించారు. ఉదయం 11 గంటలకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి కన్నూర్‌ పర్యటనలో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ ప్రత్యేక విమానంలో ఆయనతో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి వైమానిక దళం హెలికాప్టర్‌లో ఎక్కిన ప్రధాని వాయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు వెళ్లి విపత్తు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే ముందు వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వేలో ఆయ‌న‌ కొండచరియలను ప‌రిశీలించారు. ఇది ఇరువజింజి పూజ (నది) మూలం. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంఛిరిమట్టం, ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఏరియల్‌ సర్వే అనంతరం ఆయన హెలికా...

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

National, తాజా వార్తలు
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ త‌ర్వాత‌ వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నిక‌ల్లో పోటి చేయ‌నున్న‌ట్లు వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయ‌లేదు. గ‌తంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ యూపీలోని రాయ్ బ‌రేలీ, కేర‌ళ‌లోని వాయ‌నాడ్ రెండు సీట్లల్లో పో...
Exit mobile version