విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపువరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...